నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారుతున్న డీల్స్ వెనక పెద్దలు ఎవరు?: దేవినేని ఉమ

  • ఫార్మా కంపెనీలకు భూముల కేటాయింపు
  • నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి
  • ట్విట్టర్ లో టీడీపీ నేత దేవినేని ఉమ
ఉత్తరాంధ్రలో ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూములపై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపులు జరిగాయని మండిపడ్డారు. 


"సబ్ లీజుకు ఇవ్వకూడదంటున్న పర్యాటకశాఖ నిబంధనలు, అయినా బేపార్కులో వాటా కొనుగోలు చేసిన ఫార్మా కంపెనీ, బోనస్ గా 16ఏళ్లుగా నిర్మాణం చేపట్టని వందలకోట్ల భూమి ఫార్మా కంపెనీకి, నామమాత్రపు ధరకు కేటాయింపుకు రంగంసిద్ధం. నిబంధనలకు విరుద్ధంగా చేతులుమారుతున్న డీల్స్ వెనక పెద్దలుఎవరు?" అంటూ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి దేవినేని ట్వీట్ చేశారు. దేవినేని ట్వీట్ వైరల్ కాగా, పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Devineni Uma
TDP
Telugudesam

More Telugu News